జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగానికి శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ రేపటినుండి ప్రారంభం మాస్టర్ షేక్షావలి చారి.
జోగులాంబగద్వాల 18 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీని రేపు జులై 18 వ తారీకు నుండి మొదలై ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులైన డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఐజ పట్టణ పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలాచారి వెల్లడించారు.
ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుటకై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటినుండి అనగా జులై 18 తారీకు నుండి ఆగస్టు 15 లోపు పూర్తిస్థాయిలో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మాస్టర్ షేక్షావలి ఆచారి మాట్లాడుతూ... గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చేయలేని విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 31 వేల కోట్ల తో రైతు రుణమాఫీ చేస్తుందన్నారు.రెండు పర్యాయాలు పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ 28 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రైతుల ఉసురు పోసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే 31 వేల కోట్ల రుణమాఫీ తో రైతుల రుణం తీర్చుకుందన్నారు.రైతుల అభివృద్ధిని కోరి రైతు సుస్థిరతకై నిజమైన రైతుకు ఏలాంటి ఆంక్షలు లేకుండా పాసుబుక్కు గలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ వస్తుందన్నారు. ప్రతిపక్షమైన బిజెపిని విమర్శిస్తూ.. బిజెపి ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కు 18 నియమ నిబంధనలు పెడితే తప్పు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి చూపిన మార్గదర్శకాలను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాణిమ్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దిలేటి ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాస్టర్ మధు కుమార్, , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గాలి రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సురేష్ గౌడ్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్, మహిళా అధ్యక్షురాలు సులోచనమ్మ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్ శ్రీధర్, మేకల నాగిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, జిల్లా బిసి సెల్ ఉపాధ్యక్షుడు పాండురంగ, బిసి సెల్ పట్టణ అధ్యక్షులు బసవరాజు ,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు షాలు ,నాయకులు రవీందర్, ఉప్పల క్యాంపు మహేష్, తిరుమలేశు తదితరులు పాల్గొన్నారు.