ప్రభుత్వం కళాశాల లో 3లక్షలు గోల్ మాల్

Jul 17, 2024 - 07:23
Jul 17, 2024 - 14:14
 0  3
ప్రభుత్వం కళాశాల లో 3లక్షలు గోల్ మాల్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ నెమ్మికల్ కళాశాల లో 3లక్షలు గోల్ మాల్ 7ఏళ్ల కు వెలుగు చూసిన అక్రమాలు... నేటికీ బయటికి రాకుండా ప్రయత్నాలు.. కొనసాగుతున్న విచారణ... ఆత్మకూర్ ఎస్... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్యూషన్ కొరకు కళాశాల అభివృద్ధి కొరకు కళాశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందజేసిన నిధులు విద్యార్థుల కు కళాశాలకు ఖర్చు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా గోల్ మాల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా తప్పును ఒప్పుకోవడం లో కిందిస్థాయి అధికారులు గుట్టు విప్పడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.2016-17లో నెమ్మికల్ కళాశాల కు వివిధ రూపాలలో, కళాశాల లో మౌలిక వసతుల కల్పన కోసం సుమారు 4లక్షల రూపాయలు వచ్చినట్లు తెలిసింది

ఆ నిధుల ను ఖర్చు చేయకుండా నెమ్మికల్ ఏపీజీవీబీ బ్యాంక్ లో నుండి ఎస్బిఐ బ్యాంక్ కు బదలాయించి కళాశాల కు సంబందించిన వ్యక్తి పేరున ఆ నిధుల లో 3లక్షలు చెక్కు ద్వారా డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే వ్యక్తి డబ్బులు డ్రా అయిన 3నెలలకే దొడ్డి దారిన ఫ్యాకల్టీ లెక్షరర్ గా కళాశాల లో విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారులకు కొందరు పిర్యాదు చేయగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా ఏ ఒక్క అధికారి గుట్టు విప్పడం లేదని విమర్షలొచ్చాయి. ఇప్పటికి అయినా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కళాశాల అభివృద్ది కి వచ్చిన నిధుల గోల్ మాల్ గుట్టు రట్టు చేసి కారకుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి కృష్ణయ్య ను వివరణ కోరగా నిధుల దుర్వినియోగం పై వచ్చిన పిర్యాదు పై విచారణ చేస్తున్నామని మరో వారం రోజుల్లో కారకుల పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.