విద్యుత్ మోటార్ షాక్‌తో యువకుడు మృతి
తూర్పు గార్లపాడు యువకుడికి తప్పిన ప్రమాదం_

*జోగులాంబ గద్వాల 14 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి
*రాజోలి.*
తూర్పు గార్లపాడు గ్రామ శివారుల్లో ఉదయం జరిగిన విషాద సంఘటన విషాదంలో ముంచింది. తుమ్మపల్లి గ్రామానికి చెందిన సోమేశ్వర్ రెడ్డి కుమారుడు శివారెడ్డి (28) అనంతరం ఈరోజు ఉదయం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా నది సమీపంలోని విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయబోయాడు. అయితే విద్యుత్ సరఫరా మొదలైన క్షణాల్లోనే మోటార్‌కు షార్ట్ సర్క్యూట్ జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన పిడిపాల్ అదే ప్రాంతంలో పశువులకు గడ్డి కోస్తున్న క్రమంలో, శివారెడ్డి అరుపులు విన్న పిడిపాల్ కాపాడబోయి షాక్ కొట్టడంతో.. ముళ్లపదల్లోకి పడ్డాడు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పీడీపాల్ వారి అన్నకు సమాచారం ఇవ్వడంతో ట్రాన్స్ఫార్మర్ బంద్ చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు శివరెడ్డికి భార్య ఒక కుమారుడు ఉన్నారు.