బేక్యం నివాసికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

07-09-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన ఉమ్మడి బిక్కిం గ్రామపంచాయతీ నివాసుడైన డాక్టర్ జె చిన్నబాబు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు.
గూడెం గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి మామిళ్ళపల్లి చక్రవర్తి చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి డాక్టర్ జె చిన్నబాబు కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అని, నా చిన్ననాటి స్నేహితుడు రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎన్నికైనందుకు హర్షం వ్యక్తం చేశాడు.
డాక్టర్ జె చిన్న బాబు గారిది మార్ముల ప్రాంతమైన బిక్కిం గ్రామంలో లక్ష్మీ దేవమ్మ & బిచ్చన్నల చిన్న కుమారుడు ఇతని విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసుకుని మొదట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా, ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయునిగా విద్యార్థులకు విద్యను బోధిస్తూ తన చదువుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సముద్రాన్ని ఈదినట్లు తన చదువును ఈదుతూ డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది.
మార్మూల ప్రాంతమైన తన సొంత గ్రామం బిక్కింలో తన చిన్ననాటి స్నేహితులు, గ్రామ ప్రజలు డాక్టర్ జై చిన్న బాబును అభినందిస్తూ, ఆనందం పడటం జరిగింది.