జిల్లా వ్యాప్తంగా 20న ఆర్డీవో కార్యాలయల ముందు నిరాహార దీక్షలు
జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్

చౌటుప్పల్ 16 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మందల్లగూడెం గ్రామంలో గ్రామ కమిటీ సమావేశంలో ఎన్.పి.ఆర్. డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..పెన్షన్ పెంపు,కొత్త పెన్షన్స్ మంజూరు కోసం సెప్టెంబర్ 20 న జిల్లా వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయల ముందు నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6000లకు, వృద్ధులు, వితంతువులతో పాటు మిగతా చేయూత పెన్షన్స్ 2016 నుండి 4000 లకు పెంచుతామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. కానీ పెన్షన్ పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకువడం లేదు.పెన్షన్ పెంచకుండానే ప్రస్తుతం ఇస్తున్నా పెన్షన్స్ లలో 1.92 లక్షల మంది పెన్షన్స్ 21 నెలల కాలంలో రద్దు చేశారు.2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్స్ కోసం ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.21 నెలల నుండి కొత్త పెన్షన్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు.పెన్షన్ పెంపు,కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 21 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 2025-26 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేయూత పెన్షన్స్ కోసం అవసరమైన నిధులు కేటాయించలేదు.ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరాహార దీక్షల్లో వికలాంగులు, చేయుత లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల్ కార్యదర్శి రాయగిరి యాదగిరి మందల్లగూడెం గ్రామ అధ్యక్షులు గుండు రామ నరసయ్య కార్యదర్శి మంద కృష్ణ రెడ్డి, కోశాధికారి గొర్రె రమాదేవి, ఉపాధ్యక్షురాలు కొండే సహాయక కార్యదర్శి పులిపి మాధవి ఉమా మరో సహాయక కార్యదర్శి కాటం యాదయ్య మంద లింగారెడ్డి కాటం గోరయ్య కాటం ఎల్లమ్మ జైకేసారం గ్రామ అధ్యక్షురాలు తూర్పున్ టీ శంకరమ్మ, పెడకండి చంద్రమ్మ, బొంతల యాదయ్య,జోగు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.