ఘనంగా ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు
విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు డప్పు గోపి
అడ్డగూడూరు 05 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారధి (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ కోదండరాం 71వ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు డప్పు గోపి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బుర్ర అనిల్, మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్, డప్పు పూర్ణ, డప్పు ముత్తయ్య, నందు తదితరులు పాల్గొన్నారు.