ఘనంగా జాతీయ హిందీ దివస్ వేడుకలు

తిరుమలగిరి 16 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అనంతారంలో సోమవారం జాతీయ హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందీ దివస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ ఉపాధ్యాయులు సుల్తానా బేగం, వెంకటయ్యలు పాఠశాలలో ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ ఆదేశానుసారం వైస్ ప్రిన్సిపల్ క్రాంతి కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం సెప్టెంబర్ 14న హిందీని జాతీయ భాషగా గుర్తించినందున ఈరోజు నా దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో హిందీ భాషను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. హిందీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హిందీ భాష యొక్క ప్రాముఖ్యత, దాని గొప్పతనం భారత రాజ్య భాష హిందీ దేశానికి ఎంత ఎంత కీలకమో వివరించారు. అలాగే భిన్న భాషలను గౌరవిస్తూ భారతీయ సంస్కృతి మరియు ఐక్యతను కాపాడేందుకు హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల యొక్క ఉపన్యాసాలు మరియు నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.