ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు సరఫరా

జోగులాంబ గద్వాల 6 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మండలం మండల విద్యాశాఖ కార్యాలయం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన 12,511 పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖ అధికారి జే. అమీర్ పాషా వివిధ పాఠశాలలకు పంపిణీ చేశారు. అదే విధంగా JUNE 12వ తేదీన పాఠశాలలు పున ప్రారంభం సందర్భంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మరియు MEO ఆఫీస్ సిబ్బంది ఉన్నారు.