రేసు రాములు మరణం బాధాకరం

Oct 5, 2024 - 18:47
 0  7
రేసు రాములు మరణం బాధాకరం
రేసు రాములు మరణం బాధాకరం

 రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  బిల్డర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వాలి .

 సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార   అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ 

 (సూర్యాపేట టౌన్ అక్టోబర్ 5) : రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు రాములు గౌడ్ మరణం అత్యంత బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  అడవివేముల గ్రామ శివారులో శుక్రవారం  రోడ్డు ప్రమాదంలో మరణించిన రేసు రాములు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. యూనియన్ లో క్రియాశీలక పాత్ర పోషించిన రేసు రాములు గౌడ్ మరణం యూనియన్ కు తీరని లోటు అన్నారు. రాములు కుటుంబానికి తమ యూనియన్ అండగా ఉంటుందని అన్నారు. సూర్యాపేట లొ సంతాపం ప్రకటించి నల్ల బ్యాడ్జీల తో 300 మందితో బైకు ర్యాలీ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవో తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విమర్శించారు. గతంలో మున్సిపాలిటీ ద్వారా ,మీసేవ కేంద్రాల ద్వారా ఎల్ ఆర్ ఎస్ కోసం ఎకరాకు పదివేల చొప్పున చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో తేవాలని డిమాండ్ చేశారు. ఎల్ ఆర్ ఎస్ కోసం ఎంతోమంది ప్రజలు ఎదురుచూస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ 
 జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి తండు సైదులు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె బాబా జిల్లా ఉపాధ్యక్షుడు పంతంగి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య పట్టణ కార్యదర్శి  అయితే గాని మల్లయ్య గౌడ్ సూర్యాపేట పట్టణ కార్యదర్శి జలగం లోకేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న కనకయ్య పట్టణ సహా కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్  పట్టణ ఉపాధ్యక్షుడు పంతంగి దశరథ గౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి  కిరణ్ ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ షేర్ సుధాకర్ రెడ్డి ఒంటిది సైదులు పిచ్చి బుచ్చయ్య గౌడ్ శేరి శ్రీనివాస్ రెడ్డి కనకటి మహేష్ గుండ గాని శ్రీనివాస్ మంచాల శ్రీనివాస్ పట్టేది సాయికిరణ్ బండారి మల్లేష్ చిన్న పెళ్లి సంగయ్య బండపల్లి శ్రీనివాస్ ఘనపూభారత్ దామోదర్ రె డ్డి నిరంజన్ ఉత్త శోభన్ రుద్ర కృష్ణ మూల సతీష్ వస్తావా రవి మంచు పర్వతాలు సురేష్ బైరోజు లింగ చారి షేక్ జైహిర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333