గద్వాల న్యాయవాదుల విధుల బహిష్కరణ

Jun 15, 2024 - 15:59
 0  37
గద్వాల న్యాయవాదుల విధుల బహిష్కరణ

జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాదుల శుక్రవారం కోర్ట్ విధులను బహిష్కరించారు. సివిల్ వివాదంలో తలదూర్చడంతో పాటు ప్రశ్నించిన న్యాయవాది ఇ.సురేష్ గౌడ్ ను దుర్భాషలాడి, బెదిరింపులకు దిగిన అయిజ ఎస్ఐ విజయ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు  ఆందోళన చెప్పట్టారు. అందులో భాగంగా జిల్లా న్యాయస్థాన సముదాయ ప్రధాన గేటు ముందు కొద్ది సేపు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఎస్ఐ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

 అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అంతకన్నా ముందు కోర్ట్ విధులను బహిష్కరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుష కి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి గంటా కవిత తో పాటు అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఉదయ్ నాయక్ కు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా  గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ రఘురామిరెడ్డి మాట్లాడుతూ... అయిజ పోలిస్ స్టేషన్ తో పాటు జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పోలిస్ స్టేషన్లలో ఎస్ఐలు సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్నారు.?  పోలిసులను సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని అత్యున్నత, ఉన్నత న్యాయస్థానాలతో పాటు  ఉన్నతాధికారులు ఎన్ని మార్లు చెప్పిన కింది స్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదన్నారు.? పైగా ప్రశ్నించిన పౌరులను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు?.

 ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖాజమొహినుద్దీన్, ప్రధాన కార్యదర్శి కొండాపురం షఫీవుల్లాతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333