వైకుంఠఏకాదశిసందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులకు ఇక్కట్లు
జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలోని పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భం గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనానికి గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము ఉత్తర ద్వార దర్శనానికి పోవు భక్తులకురస్తాఅపరిశుభ్రంగా ఉన్నందున భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.?చెన్నకేశవ స్వామి గుడి ఎండోమెంట్ లో కలిసి ఉంది. గుడికి చైర్మన్ కూడా ఉన్నారు. అర్చకుల నుంచి చైర్మన్ గుడి విషయంలో ఏమి స్పందించడం లేదని అర్చకులు వాపోతున్నారు.? అయితే గ్రామ ప్రజలు గుడి చైర్మన్ పదవీకాలం అయిపోయిందా లేక ఇంకా ఉందా? ఉంటే ఎందుకు చైర్మన్ పట్టించుకోవడం లేదు అని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.? ఇప్పటికైనా గుడి ధూప దీప నైవేద్యం గురించి గుడి చైర్మన్ చొరవ చూపి ఆలయం అభివృద్ధి కొరకై తోడ్పడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.