ఆత్మకూర్ ఎస్ మండల అభివృద్ధికోసం ఏర్పడిన జేఏసీ
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఆత్మకూర్ ఎస్ మండల అభివృద్ధికోసం ఏర్పడిన జేఏసీ ఆత్మకూర్ ఎస్.. ఆత్మకూర్ S మండలం నెమ్మికల్ గ్రామంలోఆత్మకూర్ ఎస్ మండల అభివృద్ధికోసం సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలోజేఏసీ(జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం మండల పరిధిలోని నెమ్మికల్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమం లో సామాజిక కార్యకర్తలు , విద్యావంతులు, పాత్రికేయులు, అడ్వకేట్స్, విద్యార్థి ఉద్యమ నాయకులు మండల వ్యాప్తంగా ఉమ్మడిగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజా సమస్యలపై, స్పందించి, అభివృద్దే ధ్యేయంగా జేఏసీ పనిచేస్తుందని సంఘ నాయకులు తెలిపారు. ప్రధానంగా సామాన్యునికి నాణ్యమైన విద్య,వైద్యం, అందాలని పచ్చని గ్రామాల్లో చిచ్చు రగిలించే మద్యపానం నిషేదించాలని అందు కోసం కలిసి వచ్చే వారినందరినీ ఆహ్వాణించనున్నట్లు తెలిపారు. త్వరలో పూర్తి కార్యచరణ వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ దండ వెంకటరెడ్డి సీనియర్ పాత్రికేయులు, భూపతి రాములు, విద్యార్థి నాయకులు , భారీ అశోక్, పందిరి మాదవరెడ్డి , తగుళ్ళ జనార్ధన్ , కృపాకర్, బెల్లంకొండ పర్వతాలు, గంగరాజు, కరుణాకర్ మల్లేష్, జానయ్య, మేడి కృష్ణ, గుండు వెంకన్న, గుండు రమేష్,వినోద్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.