డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన ""హుజూర్నగర్ పీఎస్ పరిధి
తెలంగాణ వార్త ప్రతినిధి: డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన
*హుజూర్ నగర్ PS పరిది*
*ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు హుజూర్నగర్ CI చరమంద రాజు గారు, SI ముత్తయ్య గారు పట్టణoలోనీ చైతన్య హై స్కూల్ లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.*
*CI చరమంద రాజు గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.*
*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు*
*SI ముత్తయ్య గారు మాట్లడుతూ*
*డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* *అతిక్రమించొద్దు అని అన్నారు.*
*యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు*
*అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన* *కల్పించారు*
*ఈ కార్యక్రమంలో చైతన్య హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రతాపరెడ్డి గారు, ఏఎస్ఐ రమేష్ గారు, కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్ నరేష్, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, గోపయ్య గురులింగం, ఈశ్వర చారి, కృష్ణ, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.*