వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు

భువనగిరి 03 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్ హుడ్ సెంటర్స్లలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షం ప్రకటిస్తుంది. వేతనాల పెంపు,హెచ్ ఆర్ పాలసీ అమలు కోసం, రెగ్యులరైజ్ చేయాలని 2024 నుండి ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఎస్ ఇ ఆర్ పిఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్హుడ్ సెంటర్స్ లలో పని చేస్తున్న కార్యకర్తలు, ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్,ఆయా మరియు రిహబిలిటేషన్ ప్రొఫెషనల్స్ పని 225 మంది పని చేస్తున్నారు.వీరు అతి తక్కువ వేతనాలతో గత 15 సంవత్సరాలనుండి పని చేస్తున్నారు.గత ప్రభుత్వం ఎస్ఈ ఆర్ పి లో పని చేస్తున్న అనేక మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచింది. కానీ ఎన్ హెచ్ సి లలో పని చేస్తున్న సిబ్బందిని పట్టించుకోలేదు. ఎన్.పి.ఆర్.డి మరియు ఎన్ హెచ్ సి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. 2025 ఫిబ్రవరి 25 నాడు సెర్ప్ సీఈఓ తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.చర్చల సందర్బంగా కార్యకర్తలకు ప్రస్తుతం ఇస్తున్నా 5000 నుండి 13,650 లకు, సి ఆర్ పిలకు 5000 నుండి 13,650 లకు, ఆయాలకు 4000 నుండి 7800 లకు,రిహ్యాబిలిటేషన్ ప్రోఫెషనల్స్ లకు 21,000 నుండి 36,000 లకు పెంచుతామని హామీ ఇచ్చారు.హామీ అమలు చేయడానికి ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే 2025 జూలై 23 నాడు సెర్ప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పెంచిన వేతనాలు 2025 ఏప్రిల్ నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న పెరిగిన వేతనాలను అక్టోబర్ నెలలో ఏరియర్స్తో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. వేతనాల పెంపు కోసం పోరాడిన పట్టుదలతోనే హెచ్ ఆర్ పాలసీ,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. హక్కుల సాధన కోసం కార్యకర్తలు అందరు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తుంది. సురుపంగ ప్రకాష్ జిల్లా అధ్యక్షులు వనం ఉపేందర్ జిల్లా
ప్రధాన కార్యదర్శి
బొల్లపెల్లీ స్వామి
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
కొత్త లలిత జిల్లా కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.