వెల్దేవి బస్సు సౌకర్యం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేసిన యువకులు

Mar 22, 2025 - 19:21
 0  1
వెల్దేవి బస్సు సౌకర్యం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేసిన యువకులు

అడ్డగూడూరు 22 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందించడం జరిగింది. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాచకొండ సతీశ్ గౌడ్ ఆధ్వర్యంలో కుంభం నరేందర్ గౌడ్,చిలుకూరి తిరుమలేష్ గౌడ్, తదితరులు మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా..సానుకూలంగా స్పందించి,వీలైనంత త్వరగా బస్సు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.మా విజ్ఞాపనకు స్పందించి,బస్సు సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333