ప్రజల్లో ఎన్నికల పట్ల అత్మవిశ్వాసం కలిగేలా ITBP కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.
గద్వాల్ పట్టణ ఎస్సైశ్రీనివాస్
*జిల్లా ఎస్పీ రితిరాజ్ ఐపీఎస్.*
జోగులాంబ గద్వాల 18 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఆదేశానుసారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు వినియోగించుకునెలా వారిలో నమ్మకం, బరోసా, భద్రత కలిగేలా ఈ రోజు జిల్లా కేంద్రంలో ITBP కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందనీ గద్వాల్ పట్టణ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కేంద్రము లో అంబేడ్కర్ చౌక్, కృష్ణవేణి చౌక్, న్యూ బస్ స్టాండ్, నల్ల కుంట, పాత బస్ స్టాండ్, గాంధీ చౌక్, రాజ విధి, మోమిన్ మళ్ళ , రాఘవేంద్ర కాలనీ ల లో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, బరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అన్ని మండలాలలో,పట్టణాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు జిల్లా కేంద్రములో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు.