అనుమతులు,గుర్తింపు లేని పాఠశాల,కళాశాలను వెంటనే రద్దు చేయాలి

టీ వి యన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్
అడ్డగూడూరు 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– బుధవారం రోజు జరిగిన విలేకరుల సమావేశంలో టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో జిల్లా కేంద్రాలలోఅనుమతులు,గుర్తింపు లేని పాఠశాలలు,కళాశాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల పిల్లలను వాళ్ళ కష్టాల జీవితాలలో కార్పోరేట్ వ్యవస్థలు పలు విద్యా సంస్థలు వాళ్ళ జీవితాలతో చాలగటం ఆడుకుంటూ వాళ్ళను ఈ ఫీజులు అని ఆ ఫీజులు అని వాళ్ళ రక్తం తాగుతున్నారు. ఎల్కేజీ నుండి ఇంజనీరింగ్ చదవాలనే ఆశా ఉన్న అధిక ఫీజులు వల్ల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుకొని ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కార్పోరేట్ వ్యవస్థ రద్దు కావాలంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల లో చేర్పించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్పోరేట్ వ్యవస్థ రద్దు కావాలంటే ఒక ఫీజుల నియంత్రణ చట్టం తెలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని,ధర్నాలు, రాస్తారోకో చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.