విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి

Jul 28, 2025 - 21:53
 0  27
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి

28-07-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండలంలో   బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ,బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు.చి

చిన్నంబావి మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని స్థానిక ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ సత్తా చాటాలని బీరం హర్షవర్ధన్ రెడ్డి కార్యకర్తలకు  పిలుపునిచ్చారు.

చిన్నంబావి మండలా నికి సమీప దూరంలో సభ నిర్వహించిన సీఎం  మా నియోజక వర్గానికి వరాల జల్లు కురిపించి పోతాడు అనుకున్నాం కానీ మాజీ సీఎం కేసీఆర్ గారికి జపం చేసి పోయాడు అని అన్నారు.

గతం గురించి మాట్లాడే అర్హత మంత్రి గారికి లేదు 9 ఏళ్ల 6 నెలలు బీఆర్ ఎస్ పార్టీ లో ఉండి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత కే వదిలేస్తాం, అని విమర్శించారు.

 చిన్నంబావి మండలం అభివృద్ధి జరగాలంటే నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు దేవరకొండ,కొల్లాపూర్,చిన్నంబావి మీదుగా నూతన హైవే కు ప్రతిపాదనలు పంపాను మీకు చిత్త శుద్ధి ఉంటే హైవే ను తీసుకు రావాలి అని డిమాండ్ చేశారు.

చిన్నమారు గ్రామం లో మాజీ ఉప సర్పంచ్ గారిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తే స్థానిక si దగ్గరకి వెళ్లినా...అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని దాడి జరిగిన వారికి న్యాయం చెయ్యలేదు అని అగ్రహం వ్యక్తం చేశారు.

   బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి ఇన్ని రోజులు గడిచిన దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అని విమర్శించారు.

నిండా నీరు ఉన్న సాగునీరు అందించాలననే సోయి లేని ప్రభుత్వం అని అగ్రహం వ్యక్తం చేశారు.

 శ్రీశైలం నిర్వహిస్తున్న గురించి మాట్లాడుతూ మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీశైలం నిర్వహితులకు 300 ఉద్యోగాలు కల్పించామని, నీకు సోయి ఉంటే, నిర్వహితులపైన ఏమాత్రం కనికరం ఉన్న మిగిలిపోయిన శ్రీశైలం నిర్వహితుల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో వారితో పాటు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకటరమనమ్మ చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ పుష్పలత, మాజీ ఉమ్మడి మండల ఇంచార్జ్ గోవిందు శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షురాలు తగరం లక్ష్మీ కుర్మయ్య, మాజీ సర్పంచ్ లు చక్రవర్తి, మాజీ మండల అధ్యక్షులు ఈదన్న యాదవ్, టైలర్ కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ డేగ శేకర్ యాదవ్, ఉప సర్పంచులు మధుసూదన్ రెడ్డి, ఆనంద్ యాదవ్, గూడెం తోట బాలకృష్ణ, వెంకటస్వామి, గోపాల్, చంద్రుడు, చిన్న గట్టన్న ముఖ్య నాయకులు శివ,తిరుపాలు, రాజేశ్వర్ రెడ్డి, ఈశ్వరయ్య, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State