ట్రాక్టర్ షోరూమ్ ను ప్రారంభించిన మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ

06-09-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండలంలో న్యూ హలండ్ ట్రాక్టర్ షోరూం ను ప్రారంభించిన మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ.
చిన్నంబావి మండల కేంద్రంలోని నూతన ట్రాక్టర్స్ న్యూ హాలండ్ షోరూంను మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులకు అందుబాటులో ట్రాక్టర్ షోరూం మన చిన్నంబావిలో ఏర్పాటు చేయడం హర్షనీయమని పేర్కొన్నారు.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ గారికి అభినందనలు తెలియజేశారు.
చిన్నంబావి మండలంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి మా యొక్క ట్రాక్టర్లకు ఏదైనా సమస్య వస్తే 30 నుండి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అలసిపోయే వాళ్లము. అలాంటి రైతులను దృష్టిలో పెట్టుకుని సోమేశ్వరమ్మ ఆలోచన విధానంతో చిన్నంబాయి మండలంలో ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభించినందుకు మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులు సోమేశ్వరమ్మ గారికి అదేవిధంగా షో రూమ్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.