ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తుల పై కేసు నమోదు..

ఎస్సై వెంకట్ రెడ్డి

Jul 28, 2025 - 21:26
Jul 28, 2025 - 21:28
 0  249
ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తుల పై కేసు నమోదు..

అడ్డగూడూరు 28 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్: ·

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూర్ గ్రామానికి చెందిన కొంతమంది సమాచారం మేరకు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ యస్.ఐకి అందిన నమ్మదగిన సమాచారం ప్రకారం, అందుబాటులో ఉన్న ఫోర్సుతో పాటు చిరగూడూరు గ్రామ శివారులో 3 గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తరలించడానికి ప్రయత్నస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు సాయి కుమార్ తండ్రి బిక్షపతి, వయస్సు 23 సంవత్సరాలు, పెద్దకొత్దపల్లి గుండాల మండలం & అదే గ్రామ నికి చెందిన యాకన్న తండ్రి సత్తయ్య లు బిక్కేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతి మరియు లైసెన్స్ లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నామని మరియు వారు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక రవాణా చేస్తున్నారాణి చెప్పగా వారిని వారి వెహికల్ అశోక్ లైలాండ్ ట్రక్ నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి సూ-మోటో కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.