విద్యుత్ షాక్ తో కాడి ఎద్దు మృతి బోరున విలపిస్తున్న రైతు
అడ్డగూడూరు 09 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో అంబటి శంబయ్య తండ్రి పెద్ద గోపయ్య అనే రైతు పాడి ఎద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ అగత్యానికి గురై మరణించడం జరిగిందని రైతు అంబటి సాంబయ్య తెలిపారు.గురువారం రోజు రోజువారి మాదిరిగానే మేత కోసం పొలంలో మేపుతుండగా సుమారు సమయం 2:00 గంటలకు ప్రాంతంలో పొలాలలోని విద్యుత్ ట్రాన్స్ఫారం ఎర్త్ వైర్ అనుకోకుండా కాడి ఎద్దుకు తగిలి ప్రమాదం జరిగిందని రైతు తెలిపారు.ఇదంతా విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే అని రైతులు వాపోతున్నారు. ట్రాన్స్ఫారాలు ఎక్కడ ఉన్నా దానికి రక్షణ వలయంగా చుట్టూ మరమ్మతులు చేపట్టాలి కానీ అలా చేయకపోవడం వల్ల ఇలాంటి మూగజీవాలు ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. రైతులకు,కూలీలకు కూడా ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా మండలంలోని ట్రాన్స్ఫారాలు ఎక్కడ ఉంటాయో అక్కడ రక్షణ కవచములు ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల రైతులు విద్యుత్ అధికారులను కోరుచున్నారు.రైతు కాడి ఎద్దు సుమారు విలువ సుమారు 80వేల ఉంటుందని రైతు తెలిపారు.విద్యుత్ ప్రమాదంపై తగు విచారణ నిమిత్తం చర్యలు చేపట్టి రైతును ఆదుకోవాలని గ్రామస్తులు, రైతును కోరారు.