ఎమ్మార్వో ఆఫీస్ కి ప్రింటర్ బహూకరణ...

మునగాల 09 అక్టోబర్ 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :-
మునగాల గ్రామానికి చెందిన దేవినేని సీతారామయ్య పెద్ద కుమారుడు దేవినేని నలంద శ్రీనివాస్ రిటైర్డ్ ఆర్మీ ఎయిర్ఫోర్స్ అధికారి 22 వేల రూపాయల విలువ చేసే కంప్యూటర్ ప్రింటర్ను స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి బహుకరించారు, ఇట్టి ప్రింటర్ను జాతీయ ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా గురువారం దేవినేని సీతారామయ్య చిన్న కుమారుడు కోడలు దేవినేని తరుణ్ నళిని దంపతులు తహసిల్దార్ సరితకు అందజేశారు, కార్యాలయ అవసరాల నిమిత్తం ప్రింటర్ను అందజేసిన దేవినేని సీతారామయ్య కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా తహసిల్దార్ అభినందించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ రామారావు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.