ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలం వెలదీస్తుంది...... టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉడుం కృష్ణ

Oct 9, 2025 - 17:58
 0  1
ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలం వెలదీస్తుంది...... టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉడుం కృష్ణ

మునగాల 09 అక్టోబర్ 2025 

తెలంగాణ వార్త ప్రతినిధి :- 

బీసీలను మోసం చేయడానికి 42% రిజర్వేషన్ల కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామా ఆడిందని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ అన్నారు, గురువారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ,22 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 6 గ్యారెంటీలు 420 హామీల అమలులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలం వెలదీశాడని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామీణ ప్రాంతాలలో పాలన పడావు పెట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని గొప్పగా మాయమాటలు చెబుతూ కాలం వెళ్ళదీసి, నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడిన స్థానిక సంస్థల ఎన్నికల డ్రామా రాష్ట్రంలోని బీసీలకు మరియు ప్రజలకు ఓటర్లకు అర్థం అయిపోయింది అని ఆయనఅన్నారు, దేశంలో న్యాయ నిపుణులు సీనియర్ రాజకీయవేత్తలు నెత్తి నోరు కొట్టుకుని రేవంత్ రెడ్డి చెప్పిన 42 శాతం రిజర్వేషన్లు సాధ్యపడదని చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్న మొండిగా రేవంత్ ప్రభుత్వం మోసం చేసేందుకే హడావుడిగా చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లకు బిల్లు పెట్టి ఆమోదించి, గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఆమోదం ముద్ర లేకుండానే ఎన్నికలకు వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, నేడు రాష్ట్ర హైకోర్టు విధించిన స్టే నిర్ణయంతో బీసీలను రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిందనే విషయం అర్థమయిపోయిందని మొదటి నుండి బిఆర్ఎస్ పార్టీ చెప్పిందే నేడు నిజమైందని ఆయన తెలిపారు,

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State