మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే మంజూరు చేయాలి.... కత్తి నాగబాబు
మునగాల 17 మార్చి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కార్మికులకు నెల నెల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కత్తి నాగబాబు అన్నారు శనివారం విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల కు మూడు వేల రూపాయలు వేతనం ఇస్తామని నేటి వరకు అమలు కాకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పులు తెచ్చి ముందుగా పెట్టుబడి పెట్టి అప్పులకు గురవుతున్నారు. నేటి ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి అవసరమైన వంటగ్యాస్ సబ్సిడీకి ఇవ్వాలి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి వారికి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వంట షెడ్యూలు వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలని, కాటన్ బట్టలు యూనిఫామ్ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.