వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కరుణాకర్

Oct 31, 2025 - 15:55
 0  4
వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి బిజెపి మండల అధ్యక్షుడు కుంభం కరుణాకర్

  నాగారం 30 అక్టోబర్ 2025 తెలంగాణ రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నాగారం రైతులు 100 ఎకరాల వరి పొలం నేలమట్టం అవడంతో రైతులు మొత్తం కష్టపడి పండించిన ఆరుకాలం పంట ఇలా వర్షాలు తాకిడికి చేతికొచ్చిన వరి చేను మొత్తం నేలమట్టం అవడంతో రైతులు కన్నీటి పర్యటమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం అందించాల్సిందిగా రైతులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కుంభం కర్ణాకర్,నరసింగ వెంకన్న, కన్నబోయిన అంజయ్య, భాష బోయిన యాదగిరి, తొడుసు వీరయ్య, అనంతుల సోమేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333