వనపర్తి లో ట్రాఫిక్ నిబంధనలు కఠినత్వం!!
ఇకపై హెయిల్మెంట్ తప్పనిసరి!!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పు!!
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్!!
వనపర్తి 12 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు కట్టిన తరం చేస్తున్నట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు వచ్చినప్పటికీ అట్టి నిబంధనలు పాటించకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం పట్ల పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు, వనపర్తిలో ఇకనుంచి ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అంతేకాక నెంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించి సీజ్ చేయడం జరుగుతుందని, త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తో పాటు ట్రాఫిక్ రూల్స్ లోని అన్ని నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని లేనిపక్షంలో ట్రాఫిక్ రూల్స్ నిబంధన ప్రకారం చట్టపరమైన చర్యలు కేసులు జరిమానాలు విధించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు, ఈ మధ్యకాలంలో వనపర్తి లో విచ్చలవిడిగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు రోడ్లకు అడ్డంగా కిరాణం షాపులు, వైన్స్ షాప్ లు, వివిధ రకాల సూపర్ మార్కెట్ బట్టల దుకాణాలు, మెడికల్ షాపులు వంటి వ్యాపారస్తులు రోడ్లమీద అడ్డంగా వాహనాలు నిలుపుతున్నారని మీ విషయం పైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు, ఇప్పటికైనా వనపర్తి జిల్లా ప్రజలు వాహనదారులు వనపర్తిలో ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు,