నిరుద్యోగులు స్వయంకృషితో ఎదగాలి 

Aug 11, 2024 - 18:40
Aug 11, 2024 - 19:28
 0  6
నిరుద్యోగులు స్వయంకృషితో ఎదగాలి 

జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి 

సూర్యాపేట  12 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట: నిరుద్యోగులు స్వయంకృషితో ఎదగాలని  జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్ లో నూతనంగా నిర్వాహకులు కుర్ర నరేష్ ఆధ్వర్యంలో  ఆదివారం ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా స్వయంకృషితో ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలను పొందాలని  వ్యాపారంలో వినియోగదారుల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి, నాగరాజు, సందీప్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333