వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం ...సంతోషం వ్యక్తం చేసిన రైతులు

Nov 20, 2025 - 06:54
 0  68
వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం ...సంతోషం వ్యక్తం చేసిన రైతులు

తిరుమలగిరి  20 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిరుమలగిరి పిఏసిఎస్ చైర్మన్ పాలేపు చెంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తేమశాతం లేకుండా రైతులు ధాన్యాన్ని అరబెట్టాలని తెలిపారు. తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రైతులు పండించిన సన్నవడ్లకు 500 రూ. బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. అనంతారం, నందాపురం, తిరుమలగిరి, ఈటూరు గ్రామల రైతులు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఏవో నాగేశ్వర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ జాన్ మహ్మద్, తిరుమలగిరి మండల డైరీ ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ ఆకుల వీరయ్య, కోర్డినేటర్ చెంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంకెపల్లి కొండల్ రెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, రాపాక సోమేష్,సంకెపల్లి రఘునందన్ రెడ్డి,కృష్ణమూర్తి, రమేష్, అభిలాష్, లింగయ్య, ప్రభాకర్, వెంకన్న, రామచంద్రు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి