లయన్స్ కంటి హాస్పిటల్లో వైద్య సేవల గురించి తెలుసుకున్న దామోదర్ రెడ్డి...

గురువారం ఉదయం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జమ్మిగడ్డలో గల లయన్స్ కంటి హాస్పిటల్ లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న మాజీమంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆసుపత్రికి విచ్చేసిన దామోదర్ రెడ్డికి లయన్స్ హస్పిటల్ కమిటివారు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రేస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, ధరావత్ వీరన్న నాయక్, లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్ దోసపాటి గోపాల్, ట్రెజరరీ చిలుముల శ్రీనివాస్ రెడ్డి, మర్రు హనుమంతరావు, డాక్టర్ క్రాంతి, మేనేజర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.