శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంను సందర్శించిన నూతన సూర్యాపేట మున్సిపల్ పాలక వర్గం
తెలంగాణ వార్త సూర్యపేట తేదీ18-02-2026: సూర్యాపేట పట్టణాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మున్సిపల్ పాలక వర్గ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేకపూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అలయకమిటి ఆధ్వర్యంలో చైర్పర్సన్ నివేదిత-లక్షాది, వైస్ చైర్మన్ షఫి, కౌన్సిలర్లు గుణగంటి హేమ-సతీష్, రాపర్తి భవాని-శ్రీనివాస్, నాయకులు ఫారూఖ్, బైరబోయిన శ్రీనివాస్, బత్తుల రమేష్ లను పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా జాతీయ రహ దారి ప్రక్కన ఉన్న శ్రీ శబరినగర్ అయ్యప్పస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేయాలని ఆలయ కమిటివారు చైర్పర్సన్ ని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అలయకమిటి అధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎల్గూరి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, కమిటి సభ్యులు మనసాని రామ్మూర్తి, మన సాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, జటంగి రవి, పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్ తదితరులుు పాల్గొన్నారు.