భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి

Jul 25, 2024 - 19:19
Jul 25, 2024 - 19:49
 0  4
భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఆదివాసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి


జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి  డిమాండ్

జూలై 25 వెంకటాపురం తెలంగాణ వార్త:- గురువారం నాడు వెంకటాపురం ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో జిఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం జి ఎస్ పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిదొర మాట్లాడుతూ రాష్ట్రాల విభజన వల్ల ఆదివాసీల ప్రముఖ ఆదివాసులు ప్రాంతంగా గుర్తించి ఉందని అన్నారు. విభజన వలన భద్రాచలం డివిజన్ లోనే ఆదివాసి భూభాగం మొత్తం ముక్కలు చెక్కలుగా విరిగిపోయాయని ఆయన మండిపడ్డారు.భద్రాచలం డివిజను తొలుత పార్లమెంటు చట్టంలో ఆంధ్రకు కేటాయించారని అదేవిధంగా గతంలో భద్రాచలం ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గం ఉండేదని తెలిపారు. భద్రాచలం పార్లమెంటును మహబూబాబాద్ కు తరలిస్తుంటే ఏ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం బంజారా సామాజిక వర్గానికి ఆకట్టుకునేందుకు కొత్తగూడెం కేంద్రంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ దేశంలోనే అన్ని వర్గాల కంటే ఆదిమ జాతిలే వెనుకబడిపోయాయని ఐక్యరాజ్యసమితి సైతం స్పష్టం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆదిమా జాతుల్ని గోండ్వానా భూభాగంలో విద్య రంగంలో ముందుకు రాణించేందుకు భద్రాచలం కేంద్రంగా ఆదివాసి నాయకళాశాల కోసం ఆదివాసి యువత ఉద్యమించాల్సిందే అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆదివాసి యువతకు పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333