అమర వీరుల  త్యాగాలు మరువలేనివి

Sep 17, 2024 - 21:06
 0  15
అమర వీరుల  త్యాగాలు మరువలేనివి

పోరాటయోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో ముద్రించాలి

 ప్రపంచ స్థాయిలో సాయుధ పోరాటానికి గుర్తింపు ఇవ్వాలి 

తెలంగాణ  జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

 (సూర్యాపేట, టౌన్ సెప్టెంబర్ 17 )నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు.  మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో సెప్టెంబర్ 17నీ పురస్కరించుకొని అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిజాం ఆకృత్యాలకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టులు, ప్రజలు ఎంతోమంది కాశీం రజ్వి సైన్యానికి వ్యతిరేకంగా ధైర్య సాహసాలతో పోరాటం చేషా రని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం వంటి ఎందరో పోరాట వీరులు విముక్తి కోసం పేద ప్రజల హక్కుల కోసం పోరాడి 3000 గ్రామాలను విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచారని గుర్తు చేశారు. కొమరం భీమ్, రాంజీ గోండు వంటి నాయకులు కూడా పోరాటంలో కీలకపాత్ర పోషించారని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. నిజాం పాలన నుండి విముక్తి కోసం తెలంగాణలోని ప్రతి పల్లె పల్లె న యువకులు గ్రామకరక్షక దళాలుగా ఏర్పడి పోరాటం చేశారని వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. అమరవీరుల త్యాగాలను నేటితరం ప్రజలు భవిష్యత్ తరాలకు తెలపాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను వారి పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాన్ పల్లి, బాలెoల, గుండ్రంపల్లి ప్రాంతాలలో రజాకారులతో జరిగిన వీరోచిత పోరాటాలు చరిత్రలో ఎంతో గుర్తింపు పొందాయని చెప్పారు. భూస్వామ్య  విధానాలకు వ్యతిరేకంగా భూమి ,భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయిధరైతంగా పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333