ఆర్మూడ్ విభాగం నుండి సివిల్ పోలీసులగా బదిలీ.

శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి నరసింహ

Feb 18, 2026 - 18:51
 0  0
ఆర్మూడ్ విభాగం నుండి సివిల్ పోలీసులగా బదిలీ.

సూర్యాపేట జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు లు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సిబ్బంది జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బదిలీ అయినా సిబ్బందికి మిఠాయిలు పంచి ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూడ్ విభాగం నందు క్రమశిక్షణతో పని చేశారని అభినందించారు. శాంతి భద్రతల విభాగంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడంలో ముందుండాలని తెలియజేశారు. కొత్త బాధ్యతలను సామర్థ్యంతో, నైపుణ్యంతో నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణ కలిగి కొత్త అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ నేరాల నివారణ నేరాల చేదనలో నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. 

ఈ కార్యక్రమం నందు ఎస్పీ వెంట అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచంద్ర గౌడ్, ఆర్ఎస్ఐ అన్వర్, బదిలీ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333