మొక్కజొన్న రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించండి. క్యాతూరు ప్రాథమిక సహకార సంఘం ఆఫీస్ కు తాలం వేసి నిరసన

Feb 18, 2026 - 20:12
 0  0
మొక్కజొన్న రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించండి.   క్యాతూరు ప్రాథమిక సహకార సంఘం ఆఫీస్ కు తాలం వేసి నిరసన
మొక్కజొన్న రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించండి.   క్యాతూరు ప్రాథమిక సహకార సంఘం ఆఫీస్ కు తాలం వేసి నిరసన


 తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న.

 జోగులాంబ గద్వాల 18 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అలంపూర్  గత సంవత్సరం డిసెంబర్ నెలలో వ్యవసాయ ప్రాథమిక  సహకార సంఘం క్యాతూరు ద్వారా మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల నుండి మద్దతు ధర 2400  రూపాయలతో 1568  రైతుల నుండి మొక్కజొన్నలు కొనుగోలు చేసిన ఇప్పటివరకు ఇంకా 306 మంది రైతులకు సంబంధించిన నగదు నాలుగు కోట్ల మూడు లక్షల 98 వేల యాభై ఎనిమిది(4,03,98,058) రూపాయలు  రైతుల ఖాతాలోకి జమ చేయలేదని  కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాలో నగదును జమ చేయకపోవడం ప్రభుత్వానికి రైతులపై వున్న ప్రేమ ను తెలియజేస్తుందని  అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ రైతులు  పిఎసిఎస్  కార్యదర్శిని ఆఫీసు లోపల ఉంచి తాళం వేసి నిరసన చేయడం జరిగింది బహిరంగ మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడం ప్రభుత్వం  ద్వారా సరైన ధర వస్తుందన్న ఆశతో రైతులు కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే ప్రభుత్వం మాత్రం రైతుల కళ్ళల్లో కన్నీరు కారుస్తున్నదని రైతులను బాధ పెట్టడం సరైన పద్ధతి కాదని తక్షణమే క్యాతూర్ సొసైటీ ద్వారా మిగిలిపోయిన మొత్తం నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు 
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులందరికీ తక్షణమే వారి ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి  స్థానిక సిపిఎం నాయకులు బంగారు రఫీ రైతులకు మద్దతుగా నిలిచారు.

 నిరసన చేసిన వారిలో రైతులు మాజీ చైర్మన్ రాఘవరెడ్డి గణేష్ వెంకట కృష్ణారెడ్డి లక్ష్మన్న కృష్ణ కుమార్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333