రోడ్డుపై మురుగు నీరు పట్టించుకోని గ్రామ పంచాయతీ.

జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల గోనుపాడు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎస్సీ కాలనీ లోని సీసీ రోడ్డుపై మురుగు నీరు నిలవడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు మురుగు నీరు ద్వారా దుర్వాసన ఎక్కువగా వస్తుంది దాని ద్వారా మలేరియా మరియు డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్నాయి గ్రామంలో పర్యావరణ మరియు పరిశుభ్రత పైన ప్రజలకు అవగాహన కల్పించి ఏ ఒక్కరు కూడా రోడ్ల పైన బట్టలు ఉతకడం నీళ్లు చల్లడం చెత్తాచెదారం వేయడం వంటివి చేయకుండగా అధికారులు చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది.