భక్తులతో కిటకిటలాడిన జమ్ములమ్మ దేవాలయం
జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : నడిగడ్డలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, ఇంటింటి ఆడపడుచులా భావించే జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం శ్రీ జమ్ములమ్మ పరశురామ దేవాలయాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు అమ్మవారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు.