రోడ్డు ప్రమాద పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే,మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి! బొడ్డు కిరణ్ బిఎస్పీ డిమాండ్

Nov 5, 2025 - 19:34
 0  4
రోడ్డు ప్రమాద పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే,మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి! బొడ్డు కిరణ్ బిఎస్పీ డిమాండ్

శాలిగౌరారం 05 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్;– రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అమాయక ప్రయాణికులు మృతి చెందడం అత్యంత దిగ్భ్రాంతికరం మరియు బాధాకరం. మృతుల కుటుంబాలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సరైన రహదారి మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం. ఈ మార్గంలో సరైన 'డబుల్ రోడ్డు' లేదా '4-లైన్ల రహదారి' నిర్మాణం జరిగి ఉంటే ఇంతటి ఘోరం సంభవించేది కాదు. రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కేసులను సాకుగా చూపి కాలయాపన చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,మరియు సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే స్పందించి, ఎన్జిటి కేసుల సమస్యలను పరిష్కరించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన 4-లైన్ల రహదారి నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
ప్రభుత్వానికి బీఎస్పీ డిమాండ్లు: ప్రమాదంలో మరణించిన ప్రతి మృతుని కుటుంబానికి తక్షణమే రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో అత్యుత్తమ కార్పొరేట్ వైద్య సదుపాయాలు అందించాలి. ఈ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి బీఎస్పీ రపూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాము.
బొడ్డి కిరణ్ బీఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333