రైతులకు కల్తీ ఎరువులను అమ్మితే కఠిన చర్యలు..డి.ఏ.ఓ వెంకటరమణారెడ్డి

Nov 5, 2025 - 19:33
 0  2
రైతులకు కల్తీ ఎరువులను అమ్మితే కఠిన చర్యలు..డి.ఏ.ఓ వెంకటరమణారెడ్డి
రైతులకు కల్తీ ఎరువులను అమ్మితే కఠిన చర్యలు..డి.ఏ.ఓ వెంకటరమణారెడ్డి

అడ్డగూడూరు 05 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని ఫెర్టిలైజర్ షాపులను,ఐకెపి సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు కల్తీ ఎరువులను అమ్మినచో కఠిన చర్యలు తప్పవని అన్నారు. అనంతరం వివిధ ఐకెపి సెంటర్లను సందర్శించి రైతుల వడ్ల ధాన్యాన్ని మ్యాచేర్తో పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులను తూకంలో మోసం చేస్తే రైతులు ఇచ్చే ఫిర్యాదుతో కఠిన చర్యలు ఉంటాయని అక్కడ ఉన్న అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పాండురంగచారి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333