రైతులకు యూరియా సరఫరా చేయాలి,గ్రామాల మధ్య ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జి
నిర్మాణం చేయాలని ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెడే చంద్రయ్య
అడ్డగూడూరు 08 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఐ అడ్డగూడూరు మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమం సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెడే చంద్రయ్య హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో,జిల్లాలో రైతులందరికీ సరఫరా యూరియా అందియాలని మండలాలలో వ్యవసాయ రైతులకు యూరియా అందకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు సొసైటీ వద్ద క్యు కట్టినప్పటికీ యూరియా లభ్యం కావడం లేదు వ్యవసాయం సీజన్లో దృష్టిలో పెట్టుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వనికి సహకరించి రైతులకు యూరియా సరఫరా చేయాలని అదేవిధంగా ఈ మధ్యకాలంలో అకాల వర్షాలతో వర్షాల వల్ల పత్తి రైతు గాని వరి పంట గాని సంబంధించిన రైతులకు తీవ్ర నష్టం జరిగింది.నష్టపోయిన రైతులకు ఎకరానికి పత్తి రైతుకు 50వేల రూపాయలు వరి నష్టపోయిన రైతుకు ఎకరానికి 25వేలు ఇవ్వాలని అదేవిధంగా అకాల వర్షాలకు ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,అడ్డగూడూరు గోవిందపురం గ్రామాల మధ్య ఉన్న నక్కల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, మానాయికుంట ఎక్స్ రోడ్ నుండి చౌళ్ళరామారం వరకు నత్త నడకన సాగుతున్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని,గృహజ్యోతి పథకాన్ని కొత్త రేషన్ కార్డులకు మరియు పాత రేషన్ కార్డులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం రోజు ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.సిపిఐ మండల కార్యదర్శి రేకల శ్రీనివాస్ శాంతి కుమార్ మండల కౌన్సిల్ సభ్యులు కందుకూరి వెంకన్న,బెల్లి శ్రీకాంత్, చెడే నాగేష్ ,నాగిరెడ్డి, గూడేల్లి యాదయ్య, యాట రామచంద్ర,శీలం వెంకన్న,చెడే సుందరయ్య, వెంకన్న ,సురేష్, నాగార్జున్,మారయ్య, నక్క మల్లయ్య,లింగయ్య యానాల లింగారెడ్డి,ఎడ్ల వెంకటయ్య,బవరోజు శంకరయ్య,పల్స వెంకటయ్య,బొంగు మాయవెల్లి,కందుకూరి సోమయ్య,చిప్పలపల్లి మొగులయ్య,నిమ్మల కంఠం పోగుల కనకయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.