అడ్డగూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్"బి.భార్గవి
అడ్డగూడూరు 08 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రాలోనీ ప్రభుత్వ దవఖానకు డాక్టర్"బి. భార్గవి నూతన బాధ్యతలు స్వీకరించారు.అనంత డాక్టర్ మాట్లాడుతూ..గతంలో నేను శారాజిపేట ప్రభుత్వ దవఖానకు విధులు నిర్వహిస్తుంటిని సోమవారం నుండి అడ్డగూడూరుకి డిప్యూటేషన్ మీద రావడం జరిగింది అన్నారు.అడ్డగూడూరు ప్రభుత్వ దావకాన సిబ్బంది డాక్టర్"బి.భార్గవికి ఘన స్వాగతం పలికారు.నా వృత్తి పట్ల నమ్మకంతో మండల ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తానని అన్నారు.గతంలో అడ్డగూడూరు ప్రభుత్వ దవఖానలో విధులు నిర్వహించిన మోత్కూర్ నుండి ఇంచార్జి డాక్టర్"గా ఎం.హేమంత్ కుమార్ మోత్కూరులో విధులు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దవఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.