ఎంపిటిసి,జెడ్పిటిసి పోలింగ్,ఓటరు జాబితా పై సమావేశం ఏర్పాటు ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 08 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతి నిధులతో ఎంపీడీవో శంకరయ్య అధ్యక్షతన ఎంపీటీసీ,జెడ్పిటిసి సభ్యుల పోలింగ్ స్టేషన్ల మరియు ఓటర్లా జాబితాలపై సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమావేశానికి హాజరైన అన్ని పార్టీల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత,కార్యాలయ సిబ్బంది,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.