అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తు అలంపూర్ GPOగా ట్రాన్స్ఫరై వెళ్లిన MD మహిన్ పాషాకు ఘన సన్మానం

Sep 12, 2025 - 18:55
 0  11
అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తు అలంపూర్ GPOగా ట్రాన్స్ఫరై వెళ్లిన MD మహిన్ పాషాకు ఘన సన్మానం

 జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తు అలంపూర్ మండలం GPO గా ట్రాన్స్ఫరై వెళ్లినటువంటి MD మోహిన్ పాషా కు ఈరోజు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ALO వేణుగోపాల్ తన కార్యాలయం గద్వాలలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలసి ఘనంగా పూలమాలలతో పాషా కు సన్మాన చేశారు.


    ఈసందర్బంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ALO వేణుగోపాల్ మాట్లాడుతూ మోహిన్ పాషా చాలా మృదు స్వభావి అని, మంచి గుణము గల వ్యక్తి అని, విధి నిర్వహణ లో తనకు ఎంతో సహాయకారిగా ఉండేవారని మూడు  సంవత్సరాలనుండి ఇక్కడే ఉద్యోగం చేశారు.ఈరోజు ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే బాధగా ఉంది, ఎంతో మంది కార్మికులకు ఓపిక తో సమాధానం చెప్పి మంచి పేరు తెచ్చుకున్నారు.మోహిన్ పాషా ఎక్కడున్నా సంతోషంగా ఉంటూ తన ఉద్యోగాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తు మోహిన్ పాషాను ఎన్నటికీ మరువలేనని అయన లాగా ఇంకెవ్వరు పనులు చేయలేరన్నారు అందుకే ఆయన సేవలకు ఈరోజు మనవంతు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం AITUC జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు, TUCI జల్లా కార్యదర్శి కృష్ణ AITUC రాష్ట్ర సమితి సభ్యులు మోషన్న, కార్మిక సంఘాల నాయకులు ఉప్పెరు కృష్ణ, రాబర్ట్ లు పాల్గొని మాట్లాడడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హమాలీ సంఘం నాయకులు ALO ఆఫీస్ సిబ్బంది నిశాంత్, అటెండర్ శోభా,మార్క్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333