రైతులకు ప్రధానమంత్రి పసల్ బీమా పథకాన్ని వర్తింప చేయాలి
అడ్డగూడూరు 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వర్తింపజేయాలని బిజెపి అడ్డగూడూరు మండల పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు నానుబోతు సైదులు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతివృష్టి అనావృష్టి వాతావరణంలో ఏర్పడినప్పుడు రైతంగం నష్టపోకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏర్పాటు చేయగా సగం వాటా కేంద్ర ప్రభుత్వం. సగం వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది ఉండగా వాటా చెల్లించకపోవడం వల్లనే రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుకానందున రాష్ట్ర రైతంగమంతా వరుస వర్షాలతో నష్టపోయారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు దేశానికి అన్నం పెట్టే రైతంగం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం దళారులకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సొమ్మునంత వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు.రైతంగానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం యూరియా ముందస్తు నిల్వ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలని అన్నారు. ఇప్పటికైనా రైతాంగానికి ఆదుకోవడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు చెల్లించి అతివృష్టి అనావృష్టి పరిస్థితుల నుండి రైతులను ఆదుకోవాలని కోరారు.