ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Aug 29, 2024 - 20:41
Aug 29, 2024 - 20:54
 0  17
ప్రజలకు ఇచ్చిన హామీలు  నెరవేర్చాలి

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోజరిగిన ప్రజాసంఘాల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలుదాటిపోయింది.ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు కాలేదుఅని, కొన్ని గ్యారంటీలను హరాకోరా అమలు చేసి మా ప్రభుత్వం ప్రజల పక్షపాతని కాలం గడుపుతుంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని రెక్కలు తప్ప ఆస్తులు లేని వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల గ్యారంటీని అమలు చేయాలనిఅన్నారు. అలాగేమహిళలకు ఇచ్చిన 2500 రూపాయలు హామీ అమలు చేయాలని,రుణమాఫీ కానీ రైతాంగానికి ప్రభుత్వ అధికారులే గ్రామానికి వచ్చి పరిశీలన చేసి లబ్ధిదారులకు రుణమాఫీ చేయాలి. వితంతువులకు,వికలాంగులకు. వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు నోచుకోని పేద ప్రజలందరికీ రేషన్ కార్డు మంజూరు చేయ అని అన్నారు. గ్రామాలలో విష జ్వరాల నుండి ప్రజలను కాపాడి. వైద్య క్యాంపులను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగన్న. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు. కునుకుంట్ల సైదులు. పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య. పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి.అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లె వెంకన్న. సామ నర్సిరెడ్డి. ఏఐకేఎంఎస్ నాయకులు డేగల వెంకటకృష్ణ.కొండేటి సంజీవరెడ్డి. బత్తిని ఎల్లయ్య. రవి గోపాల్. తదితరులు పాల్గొన్నారు.