రెవెన్యూ వారి సమక్షంలో పరిశీలన చేస్తే అసలు దొంగలు ఎవరు అనేది తెలుసుకోవాలనే దిశగా విచారణ చేయండి .

కాలనీ నుండి తీసుకెళ్లిన వారిని బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నారు.
ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ వినోబా నవోదయ కాలనీ ప్రజల ఇండ్లలో పోలీసు అధికారులు వెళ్లి తిరుగుతూ సోదాలులాంటి వికృత చర్యలను కొనసాగిస్తూ ది:02-03-2024 మంగళవారం రోజున కాలనీకి వచ్చి సుమారు ఎనిమిది మంది వ్యక్తులను తీసుకెళ్ళి డబ్బులు ఎక్కువ మొత్తాలలో తీసుకున్నారనే తప్పు జరిగిందని
మా కాలనీ నుండి తీసుకెళ్లినవారిపై బలవంతంగా ఒప్పించాలని చూసారు కానీ పోలీసులకు అనుకూలమైన సమాధానం రాలేదని మీరు ఇంటికి ఒకరు ఆడ మనిషి స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలనే విచారణ చేయడంలాంటి చర్యలు సరైనవి కావు . మా వినోబా నవోదయ కాలనీ ప్రజల ఏమైనా దొంగతనం చేశారా...లేక హత్యలు చేయించారా.. చేశారా..!
ఖమ్మం చుట్టూ ప్రక్కల ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయి వాటిని వెలికి తీసి కాపాడాల్సిన రెవెన్యూ వ్యవస్థకు బాధ్యత లేదు కానీ మా కాలనీపై పోలీసులకు మా భూమిలో
జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది...!ఆక్రమదారులు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన మాటలు,నిరాధారమైన పిర్యాదును నమ్మి, కాలనీకి ఉన్న హైకోర్టు ఉత్తర్వులను దిక్కరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు విచారించడం పోలీసు వ్యవస్థ వ్యవహరించే తీరు మార్చుకొని,చట్ట పరిధిలో ఉన్న వాటితో నడుచుకోవాలని
అలాగే.. డబ్బులు ఎక్కువ మొత్తాల్లో తీసుకున్నారని విచారించడానికి ముందు వినోబా నవోదయ కాలనీకి 2018, 2019 లలో వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు కానీ అమలు చేయలేదు.చేయక పోగా కాలనీ ప్రజలు ఆనాటినుండి నీళ్ళు,కరెంట్ లేక పసి పిల్లలు,వృద్దులు కుటుంబాలతో
ఎండ,వాన చీకటిలో
నానా బాధలు పడుతుంటే
ఆ సమస్యలు పట్టించుకోలేని ప్రభుత్వం ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు అని కాలనీ ప్రజలను పోలీసు స్టేషన్ కు పిలిచి విచారణ చేయడం ఇది ఎంతవరకు న్యాయం.!అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిన వెజెళ్ల సురేష్,ముళ్ళ కిషోర్,ఏనుగుల గాంధీ అను వ్యక్తులను పిలిచి భూదాన భూమి మీకు ఎలా రిజిస్టర్ అయినదని,లేక ఆ భూమి మీ వారసత్వపు పట్టాభూమా అని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను రెవెన్యూ వారి సమక్షంలో పరిశీలన చేస్తే అసలు దొంగలు ఎవరు అనేది తెలుసుకోవాలనే దిశగా విచారణ చేయండి . న్యాయంగా చట్టబద్దతగా ఆధారాలతో నివసిస్తున్న వినోబా నవోదయ
కాలనీలో ప్రజలను ఆడవారిని పిలిచి విచారణ చేయడం మానుకొవాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగ యర్రయ్య అన్నారు . ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ జంగం రాంచందర్ , సభ్యులు కుంజ కృష్ణయ్య,కొట్టే బాసు , నారాటి చంద్రమోహన్ , షేక్ అనీఫ , గడ్డి వెంకటనర్సమ్మ , అవుల శిరీష ,కల్తీ పద్మ మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.