రావాలి రావాలి రావాలి మార్పు రావాలి

కందుకూరి...అక్షర బాట
రావాలి రావాలి రావాలి
మార్పు రావాలి
మానవ అంతరంగ
హృదయాలలో
మార్పు రావాలి
ఆకలి తీర్చలేని
ఆచారాల పురాతన
పాఠాలను నెమరేసుకుంటూ
నెట్టింట్లోనే కదలని గొంగడిలా
అక్కడే నిలిచిపోక
ఉండకూడనిదేదో
నీదేశం లో ఉండి ఉయ్యాలలూగుతోందా...?
మానవ లోకాలను
మానసిక ప్రశాంతత
లేకుండా చేస్తున్న
దుష్ట స్థితిగతులు
ఏంటో నీకు తెలుసు
నీకే తెలుసు
నీకు మాత్రమే
బాగా తెలుసు
మిత్రమా
అయితే ఆలస్యం
దేనికి కూకటివేళ్లతో
పెరికి వేయి
ఓ యువత... ఆగిపోకు
ఓ..నవ యువత ఆగిపోకు
ఈ యుగ సంబంధమైన
కట్లు తెంపుకో...!
నీ భవిష్యత్తు తరాలకు
ఆదర్శ బాటలు వేయడానికి
నీ నుండి
"మొదటి అడుగు"
పడాల్సిందే
నిద్రపోకు నేస్తమా
నిద్రపోకు
లోకానికి వెలుగు
పంచాలని
అనునిత్యం
తన తనువంతా
కాల్చుకుంటున్న
సూర్యుడు ఆగిపోతే
లోకానికి వెలిగేది
నీ దేశం నీ రాజ్యం
స్వేచ్ఛ వాయువులు
పీల్చుకుని
ప్రశాంతమైన
వాతావరణంలో
బాల భానుడినికి
స్వాగతం పలికేలా
అడుగులు వేయి
పరుగులు పెట్టు
పెట్టించు
శఖ పురుషుల
ప్రత్యేక అక్షర పుటాలలో
నీ పేరు లిఖించబడేలా
మానవత్వం
మంట కలిసిపోయిన
ఈ మూర్ఖపు
మనుష్య
సమాజంలో
జరుగుతున్న
అన్యాయాలను
అక్రమాలను
చూసినప్పుడు
విన్నప్పుడు
రక్తం మరుగుతుందా...?
ఇంకా ఆలోచిస్తావేంటి
సోదరా
ఎవడో రావాలి
ఏదో చేయాలి
అనుకోకు
అది నువ్వే...!
కావచ్చు కద సోదరా
మరుగుతున్నది
నీ రక్తమే కదా
నీకేదో ఆయుధం
అవసరం లేదు
నీతి గెలవాలి
నిజాయితీ నిలబడాలి
న్యాయానికి
అన్యాయం జరగొద్దు
అని కోరుకునే
నీ గుణమే నీకు
పెద్ద వెపన్ లాంటిది
ఇంకా ఎన్నాళ్ళు
ఇంకా ఎన్నెళ్లు
బానిస కష్టాలు
ఆగని కన్నీళ్లు
ఉండొచ్చు నీకు నాకు
మన వాళ్లకు
ఇరుగు పొరుగు వారికి
అయినా...
అయినా...
అయినా
సింహం బోనులో ఉన్నా..
గాండ్రింపులో
తేడా ఉండదు
ఎదిరించే వాడు
లేకపోతే
బెదిరించే వాడిదే
రాజ్యం అవుతుంది కదా
నీ స్నేహితుడు
ఎవడో తెలుసుకో
ఓ..స్నేహితుడా
మంచివాడో...?
ముంచేవాడో...??
ధనవంతుడు తినే
అన్నం ముద్దను
పేదవాడి ఆకలి చూపు
ఎప్పుడో..ఎంగిలి చేసింది...! అన్నాడు ఒక
మహానుభావుడు
కుళ్ళిన పండ్లను
ఏ చెట్టు మోయదు
వాటంతట అవే
రాలిపోతాయనే
సత్యం తెలుసు కదా
నోరు మూసుకున్న
చేప ఏ గాలానికి
చిక్కదు... గుర్తుంచుకో
సోదరా
నీ మాట సమాజానికి
రుచికరంగా ఉందా
లేక గాయం చేసేది గా ఉందా
మలినం లేని
సరికొత్త మానవ లోకంలో
మేల్కొని సమాజానికి
నాంది పలకాలి
అన్నివేళలా
అన్ని రంగాలలో
*మీ*
*కందుకూరి యాదగిరి*