దేశ ఐక్యతకు కృషిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ..డిఎస్పి
తిరుమలగిరి 01 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుమలగిరి చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు తిరుమలగిరి స్థానిక పోలీసులు టు కె రన్ నిర్వహించారు ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించి. దేశ ఐక్యతకు కృషిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించాలన్నారు ఈ సందర్భంగా సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ. ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం ఆయన సొంతం. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను ఎనలేనిది అన్నారు స్వతంత్ర భారతదేశానికి తొలి ఉప ప్రధాని, హోంశాఖా మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తెలంగాణ బిడ్డలుగా సర్దార్ పటేల్‌కు గౌరవ వందనం చేయడం మన అదృష్టం. ఆయన చూపిన ధైర్యం, రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే దక్కన్ ప్రాంతానికి గుండెకాయ అయిన హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో అవిభాజ్య భాగంగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు ఏఎస్ఐ నికోలస్ ఎస్బి సుధాకర్ కానిస్టేబుల్స్ వెంకన్న సైదులు విజయ్ ప్రసాద్ సంజీవ్ చారి వివిధ పాఠశాల విద్యార్థులు యువతి యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు