యాదాద్రి జిల్లా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కలెక్టర్ హనుమంతురావు

Aug 28, 2025 - 10:11
Aug 28, 2025 - 10:11
 0  93
యాదాద్రి జిల్లా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కలెక్టర్ హనుమంతురావు

*యాదాద్రి జిల్లా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కలెక్టర్ హనుమంతురావు* అడ్డగూడూరు 28 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థులు సురక్షత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు గురువారం 28 ఆగస్టు 2025 సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతురావు తెలిపారు.ఈ కారణంగా పాఠ్య పథకానికి భంగం కలగకుండా ఉండేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండవ శనివారం 13–9–2025 రోజున అన్ని పాఠశాలలో నిర్వహించాలని సూచించారు.అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్యాలు దీనిని గమనించి సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు.