BRS పార్టీ కార్యకర్తల భారీ నిరసన ర్యాలీ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో నెమ్మికల్ ఏపూరు లలో BRS భారీ నిరసన ర్యాలీ.. కెసిఆర్ సిట్ విచారణ పట్ల బగ్గుమన్న BRS శ్రేణులు.. BRS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నెమ్మికల్ దంతాలపల్లి రోడ్ పై బైఠాయించి మరియు ఏపూరి లో రహదారిపై భారీ నిరసన ర్యాలీ చేపట్టినారు ఈ సందర్బముగా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు తుడి నరసింహ రావు జిల్లా నాయకులు మరల చంద్ర రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగినారు కాంగ్రెస్ దగా కోరు పాలనలో రాష్ట్ర ప్రజలు త్వరలో రేవంత్ ను గద్దె దించెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సి ట్ విచారణ పేరుతో మాజీ సీఎం కెసిఆర్ ను విచారించడం అత్యంత దుర్మార్గమైన చర్యని తీవ్రంగా విమర్శించినారు తెలంగాణ ను తీసుకువచ్చిన జాతీ పితాను వేధింపులకు గురించేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అగ్రహానికి గురికావడం తప్పదు అని హెచ్చరించినారు ప్రభుత్వ అసమర్థ పాలన వలన మాయమాటలతో గద్దె నెక్కి 420 హామీలతో పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి కి బుద్దిచెప్పేఏం దుకు సిద్ధంగా ఉన్నారని మునిసిపల్ ఎలక్షన్ లో ఎలాగో గెలవలేము అని కెసిఆర్ పై కుట్రలు పన్నినరు అని గత పదేండ్ల పాలనలో బ్రహ్మాండమైన చూపించాము కావున సీట్ విచారణ పేరుతో కెసిఆర్ ను విచారించడం దుర్మార్గమైన చర్యగా వర్ణించినారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు తుడి నరసింహారావు జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి కొణతం సత్యనారాయణ రెడ్డి బెల్లంకొండ యాదగిరిగౌడ్ కసగాని బ్రహ్మం గౌడ్ రామన్న గూడెం సర్పంచ్ బత్తుల ప్రసాద్ ముద్దం కృష్ణారెడ్డి రంగారెడ్డి బొల్లె జానయ్య బషీర్ ఆయా గ్రామల సర్పంచులు ఉప సర్పంచులు brs శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు