మైనర్ బాలిక కేసులో నిందితుడు రిమాండ్..ఎస్సై వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 19 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తేదీ 10/7/ 2026 నాడు ఒక మహిళ తన మనవరాలు పై బాలెంల చైతన్య తండ్రి మధు,వయస్సు:22 సంవత్సరాలు వృతి డిగ్రీ ఫైనల్ ఇయర్ సిటీ కాలేజ్ హైదరాబాద్ చదువుతున్నాడు గ్రామం:అడ్డగూడూరు అను అతను ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని 8/7/2026 సాయంత్రంనాడు తన ఇంట్లోకి గోడ దూకి వచ్చి తన మనవరాలతో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ ఫిర్యాదు చేయగా ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసులో బాధితురాలి (మైనర్ బాలిక) యొక్క వాంగ్మూలం రికార్డు తేదీ 13/7/2026 నడు చేయగా,సదరు చైతన్య రేప్ చేశాడని చెప్పగా వెంటనే కేసులోని సెక్షన్లను మారుస్తూ కోర్టుకి పంపేలోగా అదే రోజు అర్ధరాత్రి సదరు చైతన్య అట్టి మైనర్ బాలికను(మలకపేటలోని బాలిక పిన్ని ఇంటి వద్ద నుండి) తీసుకొని వెళ్ళగా మలక్ పేట పోలీస్ స్టేషన్ నందు కిడ్నాప్ కేసు బాలిక పిన్నీ పిర్యాదు పై చేయడం జరిగింది.చైతన్య మైనర్ బాలికను వారణాసి ఉత్తరప్రదేశ్ తీసుకుని వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ కి తీసుకొని వస్తుండగా పోలీసు వారికి సమాచారం అందింది చైతన్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.అదేవిధంగా బాలికను భువనగిరి సఖి కేంద్రంలో సంరక్షణ నిమిత్తం ఉంచడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నిందితున్ని రిమాండ్ కి పంపించారని అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.